దేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలాసార్లు బాధితులకు సరైన సహాయం అందక చనిపోతున్నారు. అలా కాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. దీనికి గురించి ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను మొదలుపెడతామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదలుపెట్టామని...అందులో కొన్ని బలహీనతలను గమనించామని చెప్పారు. వాటిని మెరుగుపర్చి దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్ రహదారి భ్రదతే ప్రధానం.. ఇక రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత బాధితులకు 1.5 లక్షలను తక్షణమే అందిస్తామని తెలిపారు. అలాగే హిట్ అండ్ కేసులో మృతి చెందితే 2 లక్షల వరకు అందజేస్తామని ప్రకటించారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ మొదటి ప్రాధాన్యత అసలు ప్రమాదాలు జరగకుండా చూడడం, రహదారి భద్రత అని చెప్పారు నితిన్ గడ్కరీ. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోగా.. వారిలో 30 వేల మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోయారు. ప్రాణాంతక ప్రమాదాలకు గురైన వారిలో 66% మంది 18-34 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల 10,000 మంది పిల్లలు చనిపోయారని లెక్కలు చూపించారు కేంద్ర మంత్రి. డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకపోవడం వలన దాదాపు 30 వేలమంది దాకా మృతి చెందారని తెలిపారు నితిన్ గడ్కరీ. ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!