ISRO: ఇస్రో తదుపరి ఛైర్మన్ వి. నారాయణన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తర్వాతి కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తదుపరి ఛైర్మ్‌గా వి. నారయణన్ నియమితులయ్యారు. 

New Update
isro

ISRO NEW Chairman V.Narayanan

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తు ఛైర్మన్ ఎస్. సమనాథన్ పదవీకాలం ఈనెల 14తో ముగియనుంది. అదే రోజున కొత్త ఛైర్మన్ వి. నారాయణన్ బాధ్యతలు చేపడారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియమాక కమిటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వి. నారాయణన్ రెండేళ్ళపాటూ ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. నారాయణన్..రాకెట్‌ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌కు సంబంధించి నలభై ఏళ్ళుగా పనిచేస్తున్నారు. దీంతో పాటూ ఎల్పీఎస్సీ డైరెక్టర్‌గా నారాయణన్‌ జీఎస్‌ఎల్వీ ఎంకే 3కి సంబంధించి సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నారాయణన్ ఆధ్వర్యంలో ఇస్రో రాకెట్ల కోసం ఎల్పీఎస్సీ ఇప్పటివరకు 183 లిక్విడ్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలను, కంట్రోల్‌ పవర్‌ ప్లాంట్‌లను అందించింది. ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ రూపొందిండంలో, జీఎస్ఎల్వీ ఎంకే 3 మిషన్ లాంటి ముఖ్యమైన వాటిల్లో ఈయన కీలకపాత్ర పోషించారు. 

Also Read: Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ

రెండేళ్ళు కీలక ప్రాజెక్టులు..

ఇక ఇప్పటి వరకు ఎస్. సోమనాథన్ ఇప్పటివరకు ఇస్రో అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. 2022లో ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. చంద్రయాన్–3 సక్సెస్ అవడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. చంద్రయాన్‌-3ని కక్ష్యలోకి తీసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ లేదా లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 డిజైన్‌ రూపకల్పనలో సోమనాథన్ కష్టమే ఎక్కువగా ఉంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను సమన్వయపరిచి వారినుంచి సరైన ఫలితాలను రాబట్టారు. దీంతో పాటూ గగన్ యాన్ మిషన్, ఆదిత్య ఎల్–1, లాంచ్ వెహికల్ మార్క–3 లాంటివి ఈయన నేతృత్వంలోనే సక్సెస్ సాధించాయి.

Also Read: HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు