HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు

హైదరాబాద్‌లో హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పటికే చట్టంలో కూడా సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

New Update
Revanth hydra

ఎన్ని అవాంతరాలు వచ్చినా హైడ్రాను ఆపేదే లేదని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి తగ్గట్టే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కూడా తగ్గేదే ల్యా అంటూ అక్రమ కట్టడాలను కూల్చి వేయిస్తున్నారు. ఇప్పుడు దీనికి మరింత పవర్ చేకూరింది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు కూడా ఏర్పాటయింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. 

హైడ్రాకు చట్ట బద్ధత..

ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు చట్టానికి కూడా సవరణలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. హైదరాబాద్ లో ఉన్న జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్‌ను చేర్చింది. దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించినట్టయింది. 

ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!

హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రీసెంట్‌గా దానికి ఆమోద ముద్ర కూడా వేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో బుద్ధభవన్‌ బీ-బ్లాక్‌లో మొదటి పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సబంధించి అధికారికంగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది ప్రభుత్వం. దాంతో పాటూ హైడ్రా కార్యాలయ నిర్హణ, వాహనాల కోసం 50 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. 

మరోవైపు చెరువుల ప‌రిర‌క్షణ‌, పున‌రుద్ధర‌ణ‌, నాలాలు, ప్రభుత్వ, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ను కాపాడ‌డంతో పాటు.. ప్రకృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ప్రజ‌లకు అండ‌గా నిల‌బ‌డి స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఇప్పుడు ప్రజ‌ల నుంచి నేరుగా ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డానికి సిద్ధమైంది. ఇందుకు ప్రతి సోమ‌వారాన్ని( ప్రభుత్వ సెల‌వులు మిన‌హాయించి)కేటాయించింది. ప్రజ‌ల నుంచి ఫిర్యాదులతో పాటు స‌ల‌హాల‌ను స్వీక‌రించ‌డానికి ఈ కార్యక్రమాన్ని ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2గంట‌ల వ‌ర‌కు, తిరిగి 3.00 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కూ రాణిగంజ్‌లోని బుద్ధభ‌వ‌న్‌లో ఉంటుందన్నారు. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార ప‌త్రాల‌తో పాటు పూర్తి వివ‌రాలు తీసుకుని కార్యాయానికి రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 29560596 నంబ‌ర్లలో సంప్రదించాల‌న్నారు.

Also Read: Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు