corona: మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. దేశవ్యాప్తంగా 257 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. గత వారం కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కొత్త కరోనా కేసులు వచ్చాయి.

New Update
Corona Cases: కరోనా అలెర్ట్.. దేశంలో నాలుగు వేలు దాటినా యాక్టివ్ కేసుల సంఖ్య

మహమ్మారి కరోనా మరోసారి విజృభిస్తోంది. గతకొన్ని రోజులుగా దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు తెలిపారు. హాంకాంగ్, సింగపూర్‌లో పెరుగుతున్న కరోనా కేసులు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు చనిపోయారు కూడా. అయితే అవి కరోనా మరణాలు కాదని డాక్టర్లు తెలిపారు. చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. 

(india | corona | corona-alert | corona-death | corona-updates | corona-cases | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు