Social media torcher : ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఒకే చేసిన బాలిక...టార్చర్‌ చేసి అవి పంపాలని..

ఫోన్‌కు వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను ఓకే చేయడమే ఆ బాలిక చేసిన తప్పయింది. అదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆ బాలికను టార్చర్ కు గురిచేశాడు. పన్నెండేండ్ల బాలికపై సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

New Update
Social media torcher

Social media torcher

Social media torcher : సోషల్‌మీడియా వినియోగం పెరగడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అరాచకాలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా ఓ పన్నెండేండ్ల బాలికపై సోషల్‌ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోన్‌కు వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను ఓకే చేయడమే ఆ బాలిక చేసిన తప్పయింది. అదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆ బాలికను టార్చర్ కు గురిచేశాడు. వివరాల ప్రకారం...

 

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!


పన్నెండెండ్ల బాలిక తన నానమ్మ ఫోన్‌తో అప్పుడప్పుడు సరదాకు ఆడుకుంటోంది. కాగా తన స్నేహితులు చెప్పిన ఓ యాప్‌ను ఆ చిన్నారి డౌన్‌లోడ్‌ చేసుకుంది. అందులో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడంతో బాలిక ఒకే చేసింది. అదే అదనుగా తీసుకున్న అవతలి వ్యక్తి బాలిక వ్యక్తిగత ఫోటోలను స్ర్కీన్‌ షాట్స్‌ తీసుకుని వాటిని మార్ఫింగ్‌ చేశాడు. అంతటితో ఆగకుండా వాటిని బాలికకు పంపించి భయపెట్టాడు. ఆ ఫోటోలను తీసేయాలంటే బాలికకు చెందిన ప్రైవేటు ఫోటోలను పంపించాలని వేధించాడు. మరోకరైతే అతను అడిగినట్లే చేసేవారు. కానీ ఆ బాలిక ముందుచూపుతో ఆలోచించి జరిగిన విషయాన్ని, అవతలి వ్యక్తి తనను వేధిస్తున్న తీరును తల్లిదండ్రులకు వివరించింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు బాలికను వేధించిన వ్యక్తిని గుర్తించారు.రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు బాలికను వేధించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

ఇది కూడా చదవండి: JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్

పిల్లలకు పెద్ధవాళ్లు ఫోన్లు ఇవ్వవద్దని, ఒకేవేళ అవసరానికి ఇస్తే వారు ఏం చేస్తున్నారో గమనించాలని, ఎవరితో మాట్లాడుతున్నారో,  ఎవరితో చాటింగ్‌ చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే ఆమోదించవద్దని, ఎదుటి వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తి్‌స్తే తల్లిదండ్రులకు చెప్పాలని తెలిపారు.

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు