XXX Soap: ట్రిపుల్‌ ఎక్స్‌ సోప్స్‌ అధినేత కన్నుమూత!

ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

New Update
xxx

xxx

ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు వెల్లడించారు. 

Also Read: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

తమిళనాడు నుంచి 1980లో గుంటూరు వచ్చిన మాణిక్యవేల్ సబ్బుల వ్యాపారం ప్రారంభించారు. తాను తయారు చేసిన సబ్బులను రిక్షాలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి విక్రయించేశారు. అలా ఒక్కో మెట్టూ ఎక్కారు. ప్రకటనలకు ప్రాముఖ్యం ఉందని గుర్తించిన ఆయన బహుళ ప్రజాదరణ పొందిన సినిమా పాటల పల్లవులను ప్రచారానికి వాడారు. 

Also Read:ITBP Recruitment: బెస్ట్ ఛాన్స్.. ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. పరీక్ష లేకుండానే ఎంపిక!

అందరికీ శుభం కలుగాక, సంస్కారవంతమైన సోప్ లాంటి నినాదాలు ఉపయోగించారు. గుంటూరులోని పలు సాంస్క్రుతిక, సేవా సంస్థలు, తమిళ సంఘాలకు చేయూతను అందించారు.

Also Read: AP News: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!

Also Read: Bsnl Cheapest Recharge Plan: ఓరి దేవుడా.. రూ.750లకే 6 నెలల వ్యాలిడిటీ- 180 GB డేటా కూడా!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు