/rtv/media/media_files/2024/12/31/oviDILSXlaWfxd1LT04L.jpg)
Cheapest Recharge Plan
ప్రముఖ టెక్ బ్రాండ్ బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులను తరచూ ఆకట్టుకుంటోంది. కొత్త కొత్త ఆఫర్లను అనౌన్స్ చేసి అట్రాక్ట్ చేస్తుంది. ఈ మేరకు ప్రతి నెల లక్షల్లో యూజర్లను తన నెట్‌వర్క్‌కు సంపాదించుకుంటుంది. ఇప్పటికే పలు ఆఫర్లతో తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందించింది. ఇక ఇప్పుడు మరో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అది 6 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
BSNL New Plan
bsnl కొత్త కస్టమర్లను రప్పించుకునేందుకు రూ. 750 స్పెషల్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ 6 నెలలు (180 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ఈ ప్లాన్ అందరికీ కాదు.. GP-2 కేటగిరీలో వచ్చే ప్రత్యేక వినియోగదారుల కోసం మాత్రమేనని కంపెనీ తెలిపింది. GP-2 కేటగిరీలో గత 7 రోజులలో ఎలాంటి రీఛార్జ్ చేయని కస్టమర్‌ల కోసం తీసుకొచ్చింది.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
ఈ కస్టమర్‌లకు రాబోయే 165 రోజులలోపు ఈ ఆఫర్‌ను పొందే అవకాశం ఇచ్చింది. ఇక ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికొస్తే.. ఈ ప్లాన్‌తో 180 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ప్రతిరోజూ 1GB డేటాను పొందుతారు. అంటే మొత్తం 180GB డేటాను లభిస్తుంది. దీనితో పాటు ఈ ప్లాన్‌తో ఏదైనా నెట్‌వర్క్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో డైలీ 100 SMS సౌకర్యం కూడా అందించబడింది.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్