Ap: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం...స్పాట్‌ లోనే తల్లి,ఇద్దరు కొడుకులు దుర్మరణం!

హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వెళ్తున్న కారుని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) మృతి చెందారు.

New Update
accident

accident

శుభకార్యానికి బయలుదేరిన కాసేపటికే లారీ రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు కారులో కుటుంబ సభ్యులు బయలు దేరారు.

Aslo Read: Delhi Stampede: 'అమ్మా.. అమ్మా..' గుండె పగిలేలా రోదిస్తున్న ఢిల్లీ తొక్కిసలాట బాధితులు.. ఈ దృశ్యాలు చూస్తే కన్నీళ్లే !

ఒకే కుటుంబానికి చెందిన...

వారు వెళ్తున్న కారును ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది. కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తల్లి , ఇద్దరు కొడుకులు చనిపోయారు.మృతులు షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) గా గుర్తించారు. 

Also Read: TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్‌ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు!

మృతులు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read: Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...

Also Read: Laptop Offers: బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రావు: వదలొద్దు మావా!

Advertisment
తాజా కథనాలు