Ap Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం,నంద్యాలలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యింది.

New Update
heat

heat

ఏపీలో ఎండల తీవ్రత, వేడిగాలుల ప్రభాం కవనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతతో పాటూ ఉక్కపోత దెబ్బకు జనాలు హడలెత్తిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నమోదుకానంత అత్యధిక ఉష్ణోగ్రతలు మంగళవారం పలు ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం  -7, విజయనగరం-17, పార్వతీపురంమన్యం  -13, అల్లూరి సీతారామరాజు 2, మండలాల్లో తీవ్రవడగాలులు(39).. 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.

Also Read: J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

ఈ సీజన్లో అధిక ఉష్ణోగ్రత మంగళవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కడప, సిద్ధవటంలో 43.8 డిగ్రీలు, కర్నూలులో 43.5 డిగ్రీలు, అన్నమయ్య వతలూరులో 42.9 డిగ్రీలు, ప్రకాశంపెద్దదోర్నాలలో 42.8 , పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

APSDMA Alert

 తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 195 ప్రాంతాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 5 మండలాల్లో తీవ్రంగా, 18 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. ఇవాళ, గురువారం ఎక్కువ మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రకృతి విపత్తుల వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు . తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వడగాల్పులు, రాబోయే ముందస్తు వర్షాల నేపథ్యంలో సంసిద్ధతపై సమీక్ష నిర్వహించాను. రాబోయే రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాల్పుల పట్ల అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

మరోవైపు ఐఎండీ రైతులకు తీపికబురు చెప్పింది.. ఈ ఏడాది వర్షాలపై అప్డేట్ ఇచ్చింది.. ఈ సంవత్సరం మాత్రం 105 శాతం అధికంగా వర్షాలు పడతాయన్నారు.

Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

ap | ap-weather | AP Weather Alert | heat-waves | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు