Duvvada Srinivas: వైసీపీ(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్(YS Jagan) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారు. తాజాగా తన సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడూ జగన్‌తోనే
‘‘నాకు ఈ స్థాయిని, హోదాను, ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను. గోంతై మాట్లాడాను. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసిన నన్ను అకారణంగా.. వ్యక్తి గత కారణాలు అనే కారణంతో నన్ను సస్పెండ్ చేశారని తెలిసింది. ఇందుకు నేను పార్టీ నాకు అందించిన సహకారం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అడుగులు వేసిన నేను.. జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్న నేను.. నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయం.
Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. నేటికి 25 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నేను.. ప్రజాసేవనే పరమావదిగా భావించిన నేను.. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు. అవినీతి చేయలేదు. లంచాలు తీసుకోలేదు. అధికార దుర్వినియోగం చేయలేదు.
Also Read: ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
భూకబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిషలు పనిచేశాను. ఇక ఈ జరిగిన పరిణామాల్ని నేను స్వీకరిస్తున్నాను. ఇకనుంచి మరింత కష్టపడి పనిచేస్తాను. ఇంటింటికీ తిరుగుతాను. ప్రజలతో మమేకమైపోతాను. ఇంతవరకు గౌరవాన్ని అందించిన ప్రజలకు పాదాభివందనాలు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల సేవలో నిమగ్నమై ఉంటాను.’’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
duvvada srinivas comments | duvvada-srinivas | ys-jagan | latest-telugu-news | telugu-news
Duvvada Srinivas: థాంక్యూ జగన్.. సస్పెన్షన్ పై దువ్వాడ సంచలన వీడియో!
తన సస్పెన్షన్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ‘‘పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను. వ్యక్తిగత కారణాలతో నన్ను సస్పెండ్ చేశారు. ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమోనని అనిపిస్తుంది. ఇకనుంచి మరింత కష్టపడి పనిచేస్తాను.’’ అంటూ తెలిపారు.
MLC Duvvada Srinivas
Duvvada Srinivas: వైసీపీ(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్(YS Jagan) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారు. తాజాగా తన సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!