Sharmila Vs Jagan: ప్రజల సొమ్మును పందికొక్కులా దోచుకున్నావ్.. జగన్ పై మరోసారి షర్మిల సంచలన ఆరోపణలు!

నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో.. రాష్ట్ర  ప్రజలకు తెలుసని వైఎస్ షర్మిల తన X ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. ప్రజల సంపదను ప్యాలెస్ కు మళ్లించుకున్నారని ఆరోపించారు.

New Update
YS Jagan Vs Sharimila

YS Jagan Vs Sharimila

Sharmila Vs Jagan: షర్మిలకు పని లేదని.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెడితే తమకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ(YCP Botsa Satyanarayana) ఈ రోజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదని బొత్స ఆధ్వర్యంలో వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బొత్స. ఇందుకు కౌంటర్ గా షర్మిల తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు

బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందంటూ ఫైర్ అయ్యారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర  ప్రజానీకానికి తెలుసన్నారు. ఐదేళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: YS Sharmila : నేరస్తులను కలిసే టైముంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు ..జగన్‌ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!

ప్రజల సంపద ప్యాలెస్ కు..

పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారన్నారు. ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారంటూ ఆరోపించారు. ఐదేళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని ఫైర్ అయ్యారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారన్నారు. మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ కన్నా ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని  కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందన్నారు. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసిందన్నారు.

ఇది కూడా చదవండి: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగిందన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరిందన్నారు. ప్రతీ నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశామన్నారు. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగామన్నారు. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై  వైసీపీ పాలసీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించాలన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు