BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు

మాజీ సీఎం జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పినా గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు.

author-image
By Manogna alamuru
New Update
YS Jagan Tour

breaking news

మాజీ సీఎం జగన్ సహా మరో 8మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జగన్‌ పర్యటన సమయంలో మిర్చియార్డు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. మిర్చియార్డులోకి సరకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు