Y. S. Sharmila : నేరస్తులను కలిసే టైముంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు ..జగన్‌ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకి వెళ్లి పరామర్శించే జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ పై ఫైర్‌ అయ్యారు.

New Update
 ys sharmila

ys sharmila

Y. S. Sharmila :  నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకి వెళ్లి పరామర్శించే జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యానించారు. ఈ రోజు సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే దమ్ము వైసీపీకి లేదన్నారు.

ఇది కూడా చదవండి: Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!

 అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల మీద మాట్లాడే నైతికత లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని శర్మిల విమర్శించారు. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి:KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్‌...కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి గారికి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను..జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ..ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని ఎద్దేవా చేశారు.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

 ప్రెస్ మీట్ లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ, అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ గారికి లేదు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదన్నారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నామని షర్మిల స్పష్టం చేశారు. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

Also Read:మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

Advertisment
తాజా కథనాలు