Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!

వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. తాను చావుకు కారణమైన భర్త  తప్పించుకోకుండా ఉండేందుకు చనిపోయేయుందు తాను అనుభవిస్తున్న బాధను పెన్నుతో తన చేయి, కాళ్ళపై  రాసింది ఓ భార్య.

New Update
up-women

వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. తాను చావుకు కారణమైన భర్త  తప్పించుకోకుండా ఉండేందుకు చనిపోయేయుందు తాను అనుభవిస్తున్న బాధను పెన్నుతో తన చేయి, కాళ్ళపై  రాసింది ఓ భార్య. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో చోటుచేసుకుంది.  2023లో కుందన్‌తో మనీషా వివాహం జరిగింది.  పెళ్లిసమయంలో  వరకట్నం కింద బైక్, బంగారం ఇచ్చారు అత్తమామలు. అయితే తమకు SUV కారు కావాలని కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేశారు.  శారీరకంగా, మానసికంగా మనీషాను వేధింపులకు గురిచేశారు.  ఏడాదిలోపే భార్యను పుట్టింటికి తరిమేశాడు కుందన్.  అంతేకాకుండా ఇటీవల విడాకుల కోసం మనీషాకు బెదిరింపులకు పాల్పడ్డాడు.  కుందన్ వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లోనే మనీషా ఆత్మహత్యకు పాల్పడింది.  

అతని కుటుంబమే కారణమంటూ

ఒంటిపై కుందన్, అతని కుటుంబమే కారణమంటూ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. తన భర్త తనను కొట్టేవాడని, గదిలో బంధించేవాడని, ఆకలితో అలమటించేదానని,  మందుల ద్వారా గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేసేవాడని మనీషా తన సూసైడ్ నోట్లో ఆరోపించింది. తన కుటుంబానికి ఏదైనా జరిగితే, తన భర్త, అత్తమామలు బాధ్యత వహించాలని ఆమె రాసుకొచ్చింది.  మనీషా సోదరుడు రితిక్ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త కుందన్, ఆమె అత్తగారు, మామగారు, ఇద్దరు అన్నదమ్ములపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దివేష్ శర్మ తెలిపారు. తమ సోదరి వివాహానికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చయిందని రితిక్ చెబుతున్నారు, కానీ సోదరి అత్తమామలు కారు డిమాండ్ చేస్తూ ఆమెను వేధించారన్నాడు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు