MP Etela Rajender : సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశావో.. బీ కేర్ ఫుల్ బిడ్డా : ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

శత్రువుతో కొట్లాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్‌ చేశారు. ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపట్ల రాజేందర్‌ సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు.

New Update
Etela Rajende vs  Bandi Sanjay

Etela Rajende vs Bandi Sanjay

శత్రువుతో కొట్లాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్‌ చేశారు. ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపట్ల రాజేందర్‌ సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. సంజయ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ ప్రాంతానికి చెందిన కార్యకర్తలు శామీర్‌పేట్‌లోని ఈటెల రాజేందర్ ఇంటికి ఇవాళ(శనివారం) భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. హుజురాబాద్ తెలంగాణ ప్రతికకు అడ్డా అని ఉద్ఘాటించారు. ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ ఉండదని స్పష్టం చేశారు.  మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం తనకు రాదన్నారు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదన్నారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Bandi Sanjay vs Etela Rajendar

రాజకీయాల్లో అవమానాలు , అవహేలనలను దాటి ముందుకు వెళ్లాలని చెప్పుకొచ్చారు.  మనకు మనంగా BRS నుంచి బయటకు రాలేదు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. హుజురాబాద్ లో ఓడిపోతా అని ఊహించలేదు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని నొక్కిచెప్పారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారత దేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం పెట్టారని గుర్తుచేశారు ఎంపీ ఈటెల రాజేందర్.  

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశాడో.. బీ కేర్ ఫుల్ బిడ్డా అని హెచ్చరించారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు అన్నారు. హుజురాబాద్ లో గత 20 ఏళ్లుగా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదన్నారు. హుజురాబాద్ లో 2019 లోకసభ ఎన్నికల్లో BRS కు 53 వేల మెజార్టీ వచ్చిందన్నారు.

ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!

 వ్యక్తులు ఎదగకుండా పార్టీ బలపడలేదు. కార్యకర్తల ఆవేదన అర్ధం అయ్యింది. కార్యకర్తలకు రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేశానన్నారు. బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు చేశానని గుర్తుచేశారు. వీరుడు ఎక్కడ భయపడడు. హుజురాబాద్ గడ్డ మీద తన ప్రతి అనుచరుడు ఉంటారని వెల్లడించారు. తన సర్పంచులు , ఎంపీటీసీలు , తన వర్డ్ నంబర్లు కూడా ఉంటారని తెలిపారు. దేశ ప్రధాని వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని చెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని.. ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని విమర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్. కురుస స్వభావులు.. మిమ్మల్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!

 కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదు.ఉన్నదాంట్లో గుర్తించి మనకి పదవులు వస్తాయి. ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదని కరాఖండిగా చెప్పారు. కోవర్టులు  రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండి. హుజురాబాద్ వస్తా..  మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని గెలిపించుకుంటా.పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా .నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. కార్యకర్తలు మరుగుజ్జులు కాదు.. కుంగిపోవద్దని సూచించారు.సముద్రంలో తుఫాన్ వచ్చే ముందు సైలెంట్‌గా ఉంటదని చెప్పుకొచ్చారు. తన లాంటి వాళ్లు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుందని.. తాను ప్రజల నుంచి వచ్చిన వాడినని, ప్రజలే తనకు న్యాయ నిర్ణేతలని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.  

ఇది కూడా చూడండి:IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు

bandi sanjay vs etela rajender | bandi sanjay vs etela rajender | huzurabad | Union Minister Bandi Sanjay | MP Etela Rajender Sensational Comments | etala-rajender | eetala-rajendar

Advertisment
Advertisment
తాజా కథనాలు