BIG BREAKING: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం

పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని తన నివాసంలో ఏర్పాటుచేసిన భేటీలో పేర్కొన్నారు.

New Update
PM Modi

PM Modi

ప్రధాని మోదీ నివాసంలో  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌,  త్రివిధ దళాల అధిపతులు మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సైన్యంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు. 

Also Read: మోదీ తల తీసిన ఫొటో‌ షేర్ చేసిన పాకిస్తాన్.. కాంగ్రెస్ ఏం చేసిందంటే..?

దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం జరిగింది. దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపారు. మొత్తానికి ఉగ్రవాదాన్ని అణిచివేయడం జాతీయ సంకల్పమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము ధృడ నిశ్చయంతో ఉన్నామని చెప్పారు.ఇదిలాఉండగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని మోదీ నివాసానికి వచ్చారు. ప్రధాని నివాసానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. 

Advertisment
తాజా కథనాలు