/rtv/media/media_files/2025/05/24/umfMErosbiZLUPTE6PVy.jpg)
Vallabhaneni Vamshi Perni Nani
వల్లభనేని వంశీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారన్నారు. ఈ సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. క్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. నిలబడలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదన్నారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్ కు తరలించారన్నారు.
Also Read : నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. రికార్డులు బద్దలు కావడం పక్కా
Also Read : రేవంత్, స్టాలిన్, చంద్రబాబుతో ప్రధాని నవ్వులే నవ్వులు
టెస్టులు చేయడం లేదు..
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ మాట్లాడలేని , నడవలేని స్థితిలో ఉంటే నీరసంగా ఉందని ఓఆర్ఎస్ తాగమని చెప్తాడా? అని ప్రశ్నించారు. వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నను అరెస్టు చేస్తే పైల్స్ అంటూ డ్రామాలు ఆడారన్నారు. ప్రవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కాపాడుకున్నారని గుర్తు చేశారు.
Also Read : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!
Also Read : గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నమోదైన కేసులో అప్పటి మంత్రిని రెవెన్యూ, అధికారులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా చికిత్స అందించడం లేదు అని ప్రశ్నించారు. చెంచా గిరి చేస్తున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. సీఐ భాస్కర్ రావు అయినా.. ప్రభుత్వం ఆసుపత్రి సూపరెండెంట్ అయినా.. ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
(vallabhaneni vamsi news | PERNI NANI | telugu-news | telugu breaking news)