J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్‌ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్‌ గా అధికారులు గుర్తించారు.

New Update

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్‌ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు.

వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం బయల్దేరివెళ్లారు.ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్‌ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు.

భార్య, ఇద్దరు పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐడీ కార్డు చూసి,మతం గురించి అడిగి  మరీ కాల్పులు జరిపారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మనీశ్‌ను చంపిన ఉగ్రవాదులు.. కుటుంబ సభ్యులను విడిచిపెట్టారు. బిహార్‌కు చెందిన మనీశ్‌ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

Also Read: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

Also Read: Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

Pahalgam attack | J&K Terror Attack | vizag | nellore | latest-news | telugu-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు