J&K TerrorAttack: ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

New Update
maneesh

maneesh

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ఆయన భార్య  క్షేమంగా బయటపడగా.. వారి పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

ఈ దారుణమైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల ఐక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజల ఐక్యతకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

Also Read: J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

J&K Terror Attack

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బైసారన్ పర్యాటక ప్రాంతంలో ఈ దాడి జరిగింది. కాల్పుల సమయంలో పర్యాటకులు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘నా భర్తను చంపారు, నన్ను కూడా చంపండి’ అంటూ ఓ మహిళ విలపిస్తున్న దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి.ఈ దారుణ ఘటన గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఆయన హుటాహుటిన జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుని, గాయపడిన వారిని పరామర్శించారు.

ఈ ఉగ్రదాడిలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావు కూడా మరణించారు. ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నుండి అధికారుల బృందం కాశ్మీర్‌కు బయలుదేరిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌరులే లక్ష్యంగా ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆయన తెలియజేశారు. ఈ దాడి ఉగ్రవాదుల పనేనని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని హోం మంత్రి అమిత్ షాను ఆదేశించారు.

ఈ దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. 

Also Read: Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

telangana | hyderabad | Pahalgam attack | ib | maneesh Ranjan | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు