/rtv/media/media_files/2025/08/17/over-12-lakh-andhra-pradesh-women-use-free-bus-services-in-first-30-hours-2025-08-17-14-53-09.jpg)
Over 12 lakh Andhra pradesh women use free bus services in first 30 hours
Free Bus for Women AP:
ఏపీలో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం(Stree Shakti Scheme) కింద మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ప్రారంభించిన మొదటి 30 గంటల్లోనే ఏకంగా 12 లక్షల మంది మహిళలు ఫ్రీ బస్సు సదుపాయాన్ని వాడుకున్నారు. ఆగస్టు 15న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర నివాస హోదా కలిగిన బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లందరూ ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం పొందవచ్చు. ఈ స్కీమ్ అమలైన తొలిరోజు లబ్ధిదారులకు దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: మావోయిస్టులకు బిగ్ షాక్... కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి అరెస్ట్
ఈ పథకం కొనసాగించేందుకు రాష్ట్రానికి నెలకు రూ.162 కోట్లు, ప్రతీ ఏడాది రూ.1,942 కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రీయింబర్స్‌మెంట్ కోసం జారీ చేసిన జీరో ఫేర్ టికెట్లను ప్రభుత్వానికి సమర్పించి తద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్టినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో లబ్ధిదారులు ప్రయాణం చేయవచ్చు. మహిళల విజ్ఞప్తి మేరకు ఘాట్ రూట్‌లలో సైతం ఫ్రీ బస్సు సర్వీసులను అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా
దీంతో ఘాట్‌రోడ్లలో తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం ఉన్నంత వరకు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నారు. కానీ తిరుమల ఘాట్ రోడ్‌లో తిరిగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదని అధాకారులు తెలిపారు. అయితే తొలిరోజున ఫ్రీ బస్సు సేవలను 76 వేల మంది లబ్ధిదారులు వినియోగించుకున్నట్లు APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. అప్పలరాజు తెలిపారు. శనివారం ఈ సంఖ్య పెరిగిందని.. శని, ఆది సెలవులు ఉండటంతో వాస్తవ లెక్కలు తెలియాల్సి ఉందన్నారు. సోమవారం అందరూ పనులకు వెళ్తారు కాబట్టి వాస్తవ డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Also Read: అలస్కా చర్చల్లో విజేత పుతిన్..ప్రపంచ నాయకుడిగా నిరూపణ
మరోవైపు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లు అందించేందుకు ఆధార్ కార్డులతో పాటు లబ్ధిదారుల స్థానిక నివాస స్థితిని నిర్ధారించే ఇతర గుర్తింపు పత్రాలు కూడా ఆమోందాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొబైల్ ఫోన్‌లలో సాఫ్ట్ కాపీలు చూపిస్తే పర్మిషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతానికైతే మొబైల్ ఫోన్‌లలో ఆధార్ కార్డులు లేదా ఇతర గుర్తింపు కార్డుల ఫొటోలు చూపిస్తే అనుమతించడం లేదు. ఒరిజినల్ కార్డులు చూపిస్తేనే అంగీకరిస్తున్నారు. జిరాక్స్‌లు ఇచ్చిన కూడా అనుమతి లేదు. అయితే కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆధార్ జిరాక్స్ చూపించిన ఉచిత ప్రయాణానికి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: బిగ్‌బాస్-2 విజేత ఇంటిపై కాల్పులు..ఎవరు చేశారంటే..