Free Bus for Women AP: ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్.. మారిన రూల్స్
ఏపీలో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహిళల విజ్ఞప్తి మేరకు ఘాట్ రూట్‌లలో సైతం ఫ్రీ బస్సు సర్వీసులను అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.