Maoist Arrest: మావోయిస్టులకు బిగ్ షాక్... కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి అరెస్ట్

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్, కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి చైతో అలియాస్ నరేష్ అలియాస్ సంతును అరెస్ట్‌ చేసినట్లు అల్లూరిజిల్లా ఎస్పీ అమిత్ బర్డార్ తెలిపారు. భారీ ఆపరేషన్ చేపట్టి చైతోను అదుపులోకి తీసుకున్నామన్నారు.

New Update
Maoists... Korukonda Area Committee Secretary arrested

Maoists... Korukonda Area Committee Secretary arrested

Maoist Arrest: 

మావోయిస్టు పార్టీకి(Maoist Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్, కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి  చైతో అలియాస్ నరేష్ అలియాస్ సంతు ను అరెస్ట్‌ చేసినట్లు అల్లూరి జిల్లా ఎస్పీ(Alluri District SP) అమిత్ బర్డార్ తెలిపారు. భారీ ఆపరేషన్ చేపట్టి చైతో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రైఫిల్, పిస్టల్, లైవ్ ఆమ్యున్యూశన్, మావో సాహిత్యం సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చైతో @ నరేష్ @ సంతు, డివిజనల్ కమిటీ మెంబర్, పెడబయలు-కొరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: వీడు వార్డెన్ కాదు వేస్ట్ ఫెలో.. హైదరాబాద్‌లో బయటపడ్డ దారుణం!

జి మాడుగుల మండలం రసరాయి-బుర్రలపనుకు-చింతగుప్ప గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం, ASR జిల్లా పరిధిలో పోలీసులు పట్టుకున్నారన్నారు(Maoist Arrest). ఆయనను పట్టుకునే సమయంలో అతడు పోలీస్ పార్టీపై కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తూ, అక్కడినుంచి తప్పించుకునే యత్నం చేస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నామన్నారు చైతో నచికా ఒడిశా రాష్ట్రం, కొరాపుట్ జిల్లాలోని భలియాపుట్ గ్రామానికి చెందినవాడు. 2011లో (అప్పటికి వయసు 15 ఏళ్ళు) మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు, పార్టీ విప్లవ గీతాలు ఆకర్షించి, మొదట జన నాట్య మండలి (JNM) బృందంలో చేరాడు. ఈ బృందం కొరాపుట్ జిల్లా, బంధుగావ్ & నారాయణపట్నం ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేది. డయా SZCM అతన్ని మావోయిస్ట్ పార్టీలో చేరేలా ప్రేరేపించాడన్నారు.2012లో అతనికి పార్టీ సభ్యత్వం ఇచ్చి, నందాపూర్ ఏసీకి బదిలీ చేసి, సింగిల్ షాట్ తుపాకీ, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ అందజేశారన్నారు. 2013లో అతనిని AOBSZC టెక్నికల్ డిపార్టుమెంట్ టీమ్‌కి మార్చి, మెత్తురు జోగారావు @ టెక్ శంకర్ లతో పనిచేశాడు. 2013 – 2016 మధ్య టెక్నికల్ టీమ్‌లో పనిచేశాడు. 2017లో ACM‌గా ప్రమోషన్ పొందాడు.2017 – 2023 మధ్య కట్ ఆఫ్ ఏరియా, బోయిపరిగూడా ప్రాంతాల్లో AOBSZC వివిధ బృందాలకు కమాండర్‌గా పనిచేశాడు.

2022లో కట్ ఆఫ్ దళం కమాండర్ బాధ్యతలు అప్పగించారు. 2025లో డివిజనల్ కమిటీ మెంబర్‌గా ప్రమోషన్ పొంది, పెడబయలు-కొరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించాడు. అతను పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడని వివరించారు. చైతో వద్ద నుంచి 9 mm పిస్టల్,9 mm లైవ్ అమ్యూనిషన్, 303 రైఫిల్ (మ్యాగజైన్‌తో) ,303 లైవ్ అమ్యూనిషన్ , కిట్ బ్యాగ్స్, మావోయిస్ట్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈ సందర్బంగా అమిత్ బర్డార్ మాట్లాడుతూ  మిగిలిన మావోయిస్ట్ నాయకులు పాతబడ్డ, ఉపయోగం లేని సిద్ధాంతాలను వదిలి, పోలీసులకు లొంగిపోవాలని కోరారు.ఎవరు మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఇస్తారో, వారికి ఆశ్రయం, ఆహారం, లోజిస్టిక్స్ అందిస్తారో, లేదా ఎలాంటి సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Also Read:RS Praveen Kumar: కేసీఆర్‌ ఓటమి కోసమే మేడిగడ్డను బాంబులతో పేల్చారు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన ఆరోపణ

Advertisment
తాజా కథనాలు