Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు
ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 'గాజు గ్లాసు గుర్తును' ఫ్రీ సింబల్ జాబితాలో కేటాయించింది.
వైసీపీ మేనిఫెస్టో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీటవేసిందన్నారు సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు. తనకు సీటు రాకపోవడానికి కారణాలు అనేకమన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం అర్థరహితమని.. ఆధారాలతో వస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు.
ప్రకాశం జిల్లా మల్లాపాలెం చెక్ పోస్ట్ వద్ద రూ. 20 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బులు తరలిస్తున్న కారుతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్.
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు కొత్త అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండపి, మార్కాపురం స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించింది.
ఒంగోలు ATM క్యాష్ చోరీ నిందితుడు మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనానికి ప్రోత్సహించిన CMS సంస్థ మేనేజర్ కొండారెడ్డిని శిక్షించాలని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు.
AP: పవన్ కళ్యాణ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని అన్నారు సజ్జల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు... పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుందని అన్నారు. చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పడం తమకు మంచిదని అన్నారు.