Prakasam District : ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ 4 చోట్ల గెలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ కనిపించింది. ఈసారి జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా ఉంది.
ఒంగోలులో..
ఒంగోలులో వైసీపీ(YCP) అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ క్యాండిడేట్ దామచర్ల జనార్దన్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి దామచర్లకు ప్లస్ పాయింట్. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. ఇక బాలినేనికి ఆయన కుమారుడు ప్రణీత్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు మైనస్ అవుతున్నాయి. కుమారుడి కారణంగా పార్టీ క్యాడర్ కూడా దూరమవుతున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ దామచర్ల జనార్దన్ గెలిచే అవకాశం ఉందని మా స్టడీలో తేలింది.
కనిగిరిలో..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో కీలక సెగ్మెంట్ కనిగిరికి వెళ్తే… వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ కొత్తవాడు కావడం, టీడీపీ(TDP) కి ప్లస్ అవుతోంది. ఈ ఐదేళ్లలో ఇక్కడ సరైన అభివృద్ధి జరగలేదన్న అంశం టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి కలిసొస్తోంది. వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆయనకు ప్లస్ అవుతుంది. ఎంపీ మాగుంట టీడీపీలో చేరడం కూడా మరో ప్లస్. మొత్తంగా టీడీపీ అభ్యర్ధి ఉగ్రనరసింహారెడ్డి గెలుపు ఖాయమని మా స్టడీలో తేలింది.
చీరాలలో..
చేనేతకు కేంద్రమైన చీరాలలో టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యకు సామాజికవర్గ సమీకరణలు కలిసొచ్చే అంశం. కూటమి బలం మద్దులూరికి ప్లస్ పాయింట్. అవినీతి ఆరోపణలు కరణం వెంకటేష్‌కు మైనస్ అవుతోంది. ఆమంచి కృష్ణమోహన్ చీల్చే ఓట్లపై రిజల్ట్ ఆధారపడి ఉన్నా… అంతిమంగా ఇక్కడ TDP అభ్యర్ధి మద్దులూరి మాలకొండయ్య గెలుస్తారని RTV స్టడీ చెప్తోంది.
ఇతర స్థానాల్లో..
యర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్, దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, సంతనూనపాడులో టీడీపీ అభ్యర్థి విజయకుమార్, కందుకూరులో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో వెల్లడైంది.
Also Read : అమ్మ అమెరికా ఎందుకెళ్లిందంటే.. షర్మిల సంచలన ఇంటర్వ్యూ!
ఇంకా.. కొండేపిలో టీడీపీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయస్వామి, మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.