TDP : టీడీపీ కార్యాలయంపై డ్రోన్ కెమెరా కలకలం..!

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో డ్రోన్ కెమెరా కలకలం రేపుతోంది. టీడీపీ కార్యాలయం లోపలికి డ్రోన్ ను పంపే ప్రయత్నం చేశాడు నవీన్ అనే యువకుడు. డ్రోన్ తోపాటు ఆ యువకుడి చేతికి వైసీపీ స్టిక్కర్లు ఉండడంతో టీడీపీ నేతలు అతడిని పోలీసులకు అప్పగించారు.

New Update
TDP : టీడీపీ కార్యాలయంపై డ్రోన్ కెమెరా కలకలం..!

Ongole : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ(TDP) కార్యాలయంపై డ్రోన్ కెమెరా కలకలం రేపింది. టీడీపీ కార్యాలయం చుట్టూ డ్రోన్ కెమెరా(Drone Camera) ను తిప్పి ఆ తర్వాత కార్యాలయం లోపలికి డ్రోన్ పంపే ప్రయత్నం చేశాడు నవీన్ అనే యువకుడు. డ్రోన్ తో పాటు అతడి చేతికి వైసీపీ(YCP) స్టిక్కర్లు ఉండడంతో టీడీపీ నేతలు నవీన్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Also Read: అనకాపల్లిలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. ముత్యాలనాయుడు వర్గంపై భగ్గుమంటున్న సీఎం రమేష్ వర్గం..!

పార్టీ కార్యాలయంపై డ్రోన్ సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పుల్లలచెరువు మండలంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని హుటాహుటిన పార్టీ కార్యాలయం చేరుకొని జరిగిన సంఘటనపై నాయకులతో చర్చించారు. డ్రోన్ సంచారంపై స్థానిక టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ చేరుకొని డ్రోన్ సంచారంపై ఎరిక్షన్ బాబు సీఐతో ఆరా తీశారు.

Advertisment
తాజా కథనాలు