/rtv/media/media_files/2025/08/13/nellore-crime-news-2025-08-13-17-05-48.jpg)
Nellore Crime News
నేటి కాలంలో మహిళలపై వేధింపులు తీవ్రమైన సమస్యగా మారాయి. ఇవి కేవలం శారీరక హింసకే పరిమితం కాకుండా మానసికంగా, మాటల రూపంలో కూడా ఉంటాయి. ఈ వేధింపులు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వారి భద్రతకు ముప్పుగా మారతాయి. పనిచేసే చోట, బయట, ఆన్‌లైన్‌లో ఇలా ఎక్కడైనా వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీటిని ఎదుర్కోవడానికి చట్టాలు ఉన్నా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రానంతవరకు.. ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు. తాజాగా ఓ మహిళను వేధిస్తున్నాడని ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన ఘటన ఏపీ(AP Crime) లో చోటు చేసుకుంది.
మహిళలను వేధించినందుకే..
నెల్లూరు జిల్లా(Nellore District) లో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపడం కలకలం రేపింది. మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... మూలపేటకు చెందిన లైక్ అనే యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తల్వార్, గొడ్డళ్లు వంటి పదునైన ఆయుధాలతో వెంటాడి.. అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు లైక్ ఒక మహిళను వేధిస్తున్నాడని.. ఈ వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు మిస్సింగ్.. ఎందుకంటే?
లైక్‌ను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అతను పట్టించుకోలేదని.. దీంతో సహనం కోల్పోయిన నూరు.. మరికొందరు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నడిరోడ్డుపై నరికి చంపేంతగా తీవ్రత ఉన్న ఈ ఘటనతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్.. దొరికిన దొంగలు
nellore crime news | ap crime latest updates | ap-crime-news | telugu-news | latest-telugu-news | andhra-pradesh-news | telugu crime news