/rtv/media/media_files/2025/08/13/khajana-2025-08-13-10-30-23.jpg)
హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ దొంగలను పట్టుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆరుగురు దొంగలు రెండు బైక్లపై పారిపోతుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఫేసు కు మాస్క్ ,తలపై క్యాపు ,చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా వీరంతా పట్టుబడ్డారు. దొంగతనం చేసిన బైక్ లనే దోపిడీకి వాడినట్లు గుర్తించారు పోలీసులు. ఈ దోపిడీ వెనుక అంతర్-రాష్ట్ర ముఠాల హస్తం ఉందా అని కూడా పరిశీలిస్తున్నారు.
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) August 13, 2025
దోపిడీ దొంగలను పట్టుకున్నట్లుగా సమాచారం.
పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలు పట్టివేత.
సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్న పోలీసులు.
ఆరుగురు దొంగలు రెండు బైక్లపై పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు.
ఫేసు కు… pic.twitter.com/xMgWPEnFwK
తుపాకులతో సిబ్బందిని బెదిరించి
చందానగర్‌లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ లో మంగళవారం (ఆగస్టు 12) ఉదయం షాపు తెరిచిన వెంటనే ముసుగులు ధరించిన ఆరుగురు దుండగులు షాపులోకి చొరబడ్డారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించి, లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నిరాకరించడంతో గాల్లోకి, అలాగే డిప్యూటీ మేనేజర్ కాలిపై కాల్పులు జరిపి భయానక వాతావరణాన్ని సృష్టించారు. అందినకాడికి దోచుకుని అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ప్రదర్శనలో ఉన్న వెండి ఆభరణాలను దోచుకుని పారిపోయారు. వెంటనే షాపు సిబ్బంది సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు. ఈ దోపిడీ ఘటనలో గాయపడిన డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.