/rtv/media/media_files/2025/08/24/lord-ganesha-with-a-lakh-sarees-2025-08-24-18-10-13.jpg)
Lord Ganesha with a lakh sarees..
దేశవ్యాప్తంగా ఈనెల 27 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వీధులన్నింటిలోనూ వినాయక చవితి(Ganesh Chathurthi 2025) సందడి మొదలైపోయింది. విభిన్న రూపాల్లో అలంకరించిన వినాయక విగ్రహాలు(ganesh-idol) మండపాల్లో కొలువుదీరడానికి సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల నిర్వహకులు విభిన్న రీతుల్లో వినాయకుడిని నిలపడానికి ఉత్సహపడుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో నిలిచే విశాఖపట్నంలోని గాజువాకలోనూ ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వినాయకున్ని రూపొందిస్తున్నారు. గతంలో 117 అడుగుల ఎత్తైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి రికార్డు సృష్టించిన గాజువాక నిర్వహకులు ఈసారి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఈ ఏడాది ‘శ్రీ సుందర వస్త్ర మహా గణేశ్’ పేరుతో లంక గ్రౌండ్‌లో 90 అడుగుల ఎత్తైన గణనాథుడిని సిద్ధం చేస్తున్నారు.
Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్
Ganesh Idol With Million Sarees
అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈసారి వెరైటీగా చీరలతో గణనాథుడిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ముంబై, చెన్నై, సూరత్ తదితర ప్రాంతాలతో పాటు పలు నగరాల నుంచి సేకరించిన లక్షచీరలతో మహా గణపతిని ఏర్పాటు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు. తొలుత రెండు, మూడు రకాల ఆహార పదార్థాలతో వినాయకుడిని తయారు చేయాలని అనుకున్నప్పటికీ అవి ఎక్కువ రోజులు ఉండవని భావించి చీరలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే స్వామి అభిషేకానికి టన్ను పసుపు, టన్ను కుంకుమ, టన్ను విభూతి, టన్ను పువ్వులు ఉపయోగించ నున్నట్టు నిర్వహకులు తెలిపారు. నిమజ్జనానికి 5 టన్నుల లడ్డూను ఉపయోగించనున్నారు.
అంతేకాక నిమజ్జనం కూడా వెరైటీగానే ప్లాన్ చేశారు. ఆ ప్రత్యేకత ఏంటంటే, విగ్రహ నిర్మాణానికి వినియోగించిన చీరలను నిమజ్జనం అనంతరం భక్తులకు పంచిపెట్టనున్నారు. దేశంలో చీరలతో గణపతి విగ్రహాన్ని ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని తామే మొదటిసారి తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది గాజువాకకు గర్వకారణమే కాకుండా, పర్యావరణహిత ఉత్సవాలకు ఇదోక మంచి ఆరంభమని భావిస్తున్నారు.
Also Read: ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ