/rtv/media/media_files/2025/04/12/mBdoKlD3DaRMSEXXW5oN.jpg)
Lady Aghori Sri Varshini Abscond
అఘోరీ-శ్రీ వర్షిణి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మరింత సంచలనంగా మారారు. వర్షిణీ మెడలో మూడోసారి తాళికట్టిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అఘోరీ, శ్రీవర్షిణిలపై కొందరు ట్రాన్స్‌జెండర్లు విరుచుకుపడుతున్నారు. వాడు అఘోరీ కాదని.. వాడొక మోసగాడని అంటున్నారు.
ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
అంతేకాకుండా అఘోరీ తన మొదటి భర్త అని రాధ అనే మహిళ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అఘోరీ, వర్షిణిల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వారిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ట్రాన్స్‌జెండర్లు సైతం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు అందించారు.
ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
పరారీలో అఘోరీ
ఈ విషయం తెలుసుకున్న శ్రీవర్షిణి, అఘోరీ పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. నిన్నటి (బుధవారం) నుంచి కూడా వారిద్దరి ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారిపై కేసులు నమోదు అయిన నేపథ్యంలో అరెస్టు చేస్తారనే భయంతో అఘోరీ, శ్రీవర్షిణి పరారైనట్లు తెలుస్తోంది. ఇక అఘోరీపై శామీర్ పేట్‌లో కేసు పెట్టిన జోగిని సంధ్య సంచలన విషయాలు తెలిపారు.
ఈ మేరకు సంధ్య మాట్లాడుతూ.. ‘‘అఘోరీగాడు ఒక ట్రాన్స్ జెండర్.. వాడు ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. వాడిని వెంటనే అరెస్టు చేయాలి. అఘోరిని పట్టుకుని లోపలెయ్యాయి. వాడు మా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలలో పరువు తీసేశాడు. వాడు ఒకవైపు అఘోరీల పరువు, మరోవైపు ట్రాన్స్ జెండర్ల పరువు తీసేశాడు. మేము బయట తిరగాలంటే తలెత్తుకోలేకపోతున్నాం. సనాతన ధర్మం.. లోకకళ్యాణమంటూ వచ్చినోడు.. ఇప్పుడు వాడి కళ్యాణం చేసుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలి.’’ అంటూ డిమాండ్ చేసింది.
Lady Aghori Sri Varshini | aghori | aghori breaking news | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news