Aghori - Sri Varshini Marriage: అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

అందరూ అనుకున్నట్లుగానే అఘోరీ - వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వర్షిణీ స్వయంగా తెలిపింది. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో బ్రహ్మముహూర్తం సమయంలో అఘోరీ.. తన మెడలో తాళి కట్టింది అని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

New Update

అయిపోయింది.. అంతా అయిపోయింది. గత ఏడాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ.. ఇప్పుడు ఓ ఇంటివాడు అయిపోయాడు. వర్షిణీ - అఘోరీ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ గత కొన్నాళ్లుగా వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడు దుర్గమ్మ గుడిలో ఏడడుగులు వేసి దంపతులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా వర్షిణీ చెప్పడం గమనార్హం. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షిణీ ఎన్నో కళ్లుబైర్లుగమ్మే విషయాలు చెప్పుకొచ్చింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అఘోరీతో పెళ్లి అయింది

అందులో తనకు అఘోరీతో పెళ్లి అయిందని తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘నాకు అఘోరీకి పెళ్లి అయింది. మొదటి సారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర తాళి కట్టింది.  బ్రహ్మ ముహూర్తానికి వెళ్లి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత రెండోసారి విష్ణు అన్నయ్య దగ్గర మరోసారి తాళికట్టింది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అప్పుడే విష్ణు అన్నయ్య తనకు కూడా తాళి కట్టమని అడిగాడు. అప్పుడు విష్ణుకు కూడా అఘోరీ తాళి కట్టింది. మా ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత అఘోరీ వెళ్లిపోయి మళ్లీ వారం తర్వాత ఇంటికి వచ్చింది. వచ్చినపుడు నాకు చెన్నై నుంచి ఒక గోల్డ్ చైన్ కొనుక్కొని వచ్చింది. అప్పుడు కూడా మా ఫ్యామిలీ అందరి ముందు చైన్ నా మెడలో వేసింది. అప్పుడు నుంచి మేమందరం కలిసి మెలిసి బాగానే ఉన్నాం. కానీ అది విష్ణుకు నచ్చక అక్కడ నుంచి నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

లేనిపోనివి చెప్పి రూమర్స్ క్రియేట్ చేశాడు. ఏది ఏమైనా నా ఇష్టపూర్వకంగానే అఘోరీని పెళ్లి చేసుకున్నాను. అఘోరీ అమ్మాయా? అబ్బాయా? లేక ట్రాన్స్ జెండరా? అనేది నాకు అవసరం లేదు. ఆమె నాతో జెన్యున్‌గా ఉంది. అందువల్లనే ఆమెను ఇష్టపడ్డాను. ఇక పిల్లల విషయానికొస్తే.. అనాధాశ్రమం నుంచి పిల్లల్ని తీసుకుని పెంచుకుంటాం. 

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

సె** ఇంట్రెస్ట్ లేదు

సె** నాకు ఎప్పుడూ మెయిన్ ఉద్దేశం కాదు.. దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. మా ఇద్దరి మనస్సులు కలిసాయి. ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. కలిసి ఉండాలనుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ఒక అబ్బాయిని కాకుండా.. అఘోరీని పెళ్లి చేసుకోవడం ఏంటని? ట్రోల్స్ చేస్తున్నారు. 

(aghori | lady aghori sri varshini relation | lady aghori sri varshini video | sri varshini | aghori on sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు