Srisailam: నిన్న తిరుమల..ఈరోజు శ్రీశైలం.. సిబ్బంది చేతివాటం!
శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలంలో జనవరి ఒకటో తేదీన మల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు.
కర్నూలులో విషాదం చోటుచేసుకున్నది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాంప్రసాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సరదాగా ఆరుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో బావిలో రాంప్రసాద్ రెడ్డి శవమై కనిపించాడు.
మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నంద్యాల స్థానం నుంచి వీరు తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
భూమా అఖిల ప్రియ. మంచు మనోజ్ దంపతులు రేపు వేయి కార్లతో నంద్యాలకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమా శోభ నాగిరెడ్డి జయంతి వేడుకల్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
కర్నూలులో ఓ వ్యక్తి సొంత మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. పొలం విషయంలో ఇరు కుటుంబాలకు తగాదాలు ఉండటంతో ఆమెను ఆర్థికంగా దెబ్బతీసేందుకు యూట్యూబ్ చూసి దొంగతనం చేశాడు. ఇంట్లో కారం చల్లి 15.5 తులాల బంగారం చోరీ చేయగా.. పోలీసులకు అనుమానం వచ్చి అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను బురిడీ కొట్టించారు. 'అమ్మ ఒడి' పేరిట కర్నూలు అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.26,500 కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.