అక్క అని చూడకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై తనపై కేసులు పెట్టించాడని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్ అయ్యారు. తమ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆయన ఏం అభివృద్ధి చేశారో చర్చించడానికి తాను సిద్ధమన్నారు. ఇందుకు సిద్ధార్థ రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు. ఏనాడూ బయటకు రాని తమ అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని తాను మర్చిపోనన్నారు. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: TG Politics: వాళ్లంతా వేస్ట్.. ఫస్ట్ ఆ పదవులు పీకేయండి.. సీఎం రేవంత్ కు మీనాక్షి సంచలన ఆదేశాలు!
సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్..
చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 9 నెలలుగా ఆయన ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నించారు. కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు సిద్ధార్థ రెడ్డికి లేదన్నారు. సిద్దార్థ్ కి ఫుల్ బాటిల్ వేయడం బాగా అలవాటైందన్నారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతాడు.. సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్ అని అన్నారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటికి వస్తుందని.. ఆ వ్యవహారంలో శిక్ష తప్పదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు.
ఇది కూడా చదవండి: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి