AP News: శ్రీశైలంలో అపచారం.. మండి పడుతున్న హిందూ సంఘాలు!

కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి.

New Update
ap news

ap news

AP News: కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అపచారం జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన రామ చిలుక దహనంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రామ చిలుక దహనంపై.. 

 

రామ చిలుక దహణంపై శ్రీశైలం దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. హిందూ సమాజానికీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని హైందవ సంఘాల నేత రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం పండితులు, వైదిక కమిటీ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కడపలో దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు