/rtv/media/media_files/2025/03/12/Oaua3uRjvYwgvJm5wmtZ.jpg)
Yemmiganur
AP News: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు బనవాసి గురుకులం కళాశాలలో బుధవారం సాయంత్రం 12 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ఉండడంతో ఆరుబయట ఎండలో చదువుకునే సమయంలో కళ్ళు తిరిగి 12 మంది విద్యార్థులు పడిపోయినట్లు సమాచారం. ఎగ్జామ్స్ టెన్షన్ వల్లే విద్యార్థులకు రెండు రోజులుగా జ్వరం వచ్చిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
అస్వస్థత కారణంపై..
విద్యార్థుల అస్వస్థత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. విద్యార్థులకు వైద్యం చేయించడంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా సబ్ కలెక్టర్ పరామర్శించారు. అనంతర వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మంచి వైద్యం చేయాలని ఆస్పత్రి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు తొరగ కొలుకుని పరీక్షలు రాస్తారని వారి తల్లిదండ్రులకు దైర్యం చెప్పారు. విద్యార్థుల అస్వస్థతకు కారణంపై వైద్యులు, కాలేజీ సిబ్బంది ఆరా తీసుకున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులకు మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: నోటి పూతలను తేలికగా తీసుకోకూడదా?