Bus Accident : శంకరా ఎంత పనిచేశావ్రా.. గుండె పగిలేలా రోదిస్తున్న తల్లి- VIDEO

శివశంకర్ మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.

New Update
shiva shankar

ఏపీలోని కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం(Kurnool Bus Accident) జరిగింది. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బస్సును బైక్ ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై, సుమారు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది.మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గా పోలీసులు నిర్ధారించారు. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం (బైక్) ఢీకొట్టి, బస్సు ముందు భాగంలోకి దూసుకెళ్లింది. ఈ ధాటికి ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.

Also Read :  అందుకే ప్రమాదం జరిగింది.. ట్రావేల్స్ యాజమాన్యం కీలక ప్రకటన!

ఆసుపత్రి వద్దకు చేరుకుని

శివశంకర్(Shiva shankar) మరణం వార్త తెలియగానే అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.తాను బతికి ఉండగానే కన్న బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల యశోద తలపట్టుకుని విలపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా  శివశంకర్ గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవాడు. నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరియు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి.

Also Read :  కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్‌

Advertisment
తాజా కథనాలు