/rtv/media/media_files/2025/07/25/kakinada-crime-news-2025-07-25-17-18-09.jpg)
Kakinada Crime News
కాకినాడ జిల్లాలోని తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైడా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమన్వి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రయాణికుల బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగమే ఈ దుర్ఘటనకు కారణమైందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యానం కురసాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కూరాకుల కుమార్(30), కాకినాడ ఏటిమొగకు చెందిన తల్లి, కూతురు పోతాబత్తుల దుర్గ (55), లంకే భవాని(35)గా మృతి చెందినట్లుగా గుర్తించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరొక మహిళ చినవలసల గ్రామానికి చెందిన సంగాడి సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెన108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
డ్రైవర్ల నిర్లక్ష్యతో..
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఢీకొట్టిన వెంటనే ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. కొంతమంది ప్రత్యక్షసాక్షులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఇది కూడా చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకుని ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరికీ గాయాలయినట్లు సమాచారం లేదు. కానీ తీవ్ర భయాందోళన పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. అధిక వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధానంగా ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయి. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: రాత్రి నెయ్యితో పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | ap-crime-report | Latest News )