/rtv/media/media_files/2025/07/24/ghee-milk-2025-07-24-20-25-09.jpg)
Ghee Milk
Ghee Milk: నేటి కాలంలో ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడితో చాలా మందికి నిద్రలేమి, జీర్ణ సమస్యలు, అలసట, కీళ్ల నొప్పులు, చర్మ ఆరోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇవన్నిటికి సమగ్ర పరిష్కారంగా ఆయుర్వేదం సూచించే ఒక సాధారణ కానీ శక్తివంతమైన పానీయం నెయ్యి కలిపిన పాలు. ఇది అందుబాటులో ఉండే.. ఇంట్లో తయారు చేసుకునే ప్రకృతిసిద్ధమైన పరిష్కారం. దేశీ నెయ్యి, గోరు వెచ్చని పాలలో కలిపి తాగితే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే 30 నిమిషాల ముందు ఒక టీ స్పూన్ నెయ్యిని పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి విశ్రాంతి, శక్తి, పోషణ లభిస్తాయి. రాత్రి పడుకునే ముందు నెయ్యితో పాలు తాగితే 6 అద్భుతమైన ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నెయ్యితోపాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు:
నెయ్యి పాలు తీసుకున్నప్పుడు నాడీ వ్యవస్థపై శాంతిదాయక ప్రభావం పడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, గాఢమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఒక సహజ నివారణ. అలాగే నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ పేగులను శుభ్రపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతి ఉదయం కడుపు శుభ్రంగా ఉండే అనుభూతి వస్తుంది. ఇది మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంది. పాలు, నెయ్యి కలయిక ఎముకల బలం పెంచుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఈ పానీయం తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం ఉంటుంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో పెను విషాదం.. టెన్త్ స్టూడెంట్ సూ**సైడ్.. 5వ ఫ్లోర్ నుంచి దూకి..!
నెయ్యి, పాలు శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేస్తాయి. ఇది చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. పొడి, మురుగు చర్మం ఉన్నవారికి ఇది ఒక సహజ చికిత్సగా పనిచేస్తుంది. ప్రతి రోజూ దీనిని తీసుకోవడం వల్ల వారంలోనే చర్మంలో తేడా కనిపిస్తుంది. ఇంకా దీనివల్ల రోజంతా కష్టపడిన శరీరం నిద్రలో సమర్థవంతంగా కోలుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. శరీరానికి శక్తి, పోషణ ఇచ్చే ఈ పానీయం అలసటను దూరం చేస్తుంది. ఇది శరీర వేడిని, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ ఆరోగ్యవంతమైన, ఆయుర్వేద పద్ధతిలో తయారైన నెయ్యి పాలను తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది చిన్నచిన్న అలవాట్ల మార్పుతో పెద్ద ప్రయోజనాల్ని తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఇన్ఫెక్షన్ ప్రమాదాలు తగ్గుతాయి..!!