Kadapa: విద్యార్థులకు గుడ్ న్యూస్...నేడు పాఠశాలలకు సెలవు! కడపలో నేడు అన్ని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. పెద్ద దర్గా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ఇచ్చినట్లు ప్రకటించారు. By Bhavana 16 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa: కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసు ఉత్సవాలు వారం రోజులపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం అంటే నవంబర్ 16న గంధం కార్యక్రమం నిర్వహిస్తారు. నవంబర్ 17న కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవం జరుగుతుంది. నవంబర్ 18న ముుషాయిరా ఉంటాయని దర్గా నిర్వాహకులు ప్రకటించారు. అలాగే నవంబర్ 20వ తేదీ రాత్రి పది గంటలకు ఊరేగింపు ఉంటుందని..దానికి సంబంధించిన ఉత్సవాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిర్వాహకులు చెప్పారు. Also Read: Sabarimala: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? నవంబర్ 16వ తేదీ రాత్రి పదిగంటలకు ఆరిఫుల్లా హుస్సేనీ నివాసం నుంచి గంధం తీసుకువస్తారు. నవంబర్ 17న రాత్రి 8 గంటలకు ఉరుసు ఉత్సవం మొదలుకానుంది. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక , మహారాష్ట్రల నుంచి కూడా పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. పెద్ద దర్గాగా పిలిచే అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. Also Read: UP: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం రామ్ చరణ్ రానున్నట్లు... మరోవైపు కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో నవంబర్ 16 కడపలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కడప పెద్ద దర్గాలో ఏటా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కడప పెద్ద దర్గాకు హీరో రామ్ చరణ్ రానున్నట్లు సమాచారం. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు నిర్వాహకులు ప్రముఖులను ఏటా ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో రామ్‌చరణ్‌ను కూడా ఈసారి ఉత్సవాలకు ఆహ్వానించినట్లు తెలిసింది. Also Read: Cricket: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో ఉన్న రామ్‌చరణ్.. వీలు చూసుకుని వస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నవంబర్ 18వ తేదీ జరిగే ముషాయరా ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నిర్వహకులు తెలిపారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశాలున్నాయి. అందుకు తగినట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం మాలలో ఉన్నారు. దీంతో కడప పెద్ద దర్గాకు వస్తారా లేదా అనేదీ కూడా సందేహం కూడా ఉంది. Also Read: Railways: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి