Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కడప పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డితో పాటూ మరి కొందరిపై వీటిని జారీ చేశారు. భార్గవ రెడ్డి మీద ఇప్పటికే పలు క్రిమినల్ కసులు నమోదయ్యాయి. By Manogna alamuru 12 Nov 2024 in కడప టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Look Out Notice To Sajjala: వైసీపీ సోషల్ మీడియా హ్యాండలర్ వర్రా రవీందర్ రెడ్డిని కొన్ని రోజుల క్రితం కడప పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించే సమయంలో మరికొంత మంది సోషల్ మీడియా కార్యకర్తల గురించి పలు కీలక విషయాలు తెలిపాడు. వీటి ఆధారంగా కడప పోలీసులు మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తల మీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో పాటూ ఆంధ్రప్రదేశ్‌లో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే మరికొన్ని క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కారణంగానే వీరు విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల, అర్జున్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. Also Read : KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు? Also Read : నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్ సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం అంటూ పోలీసుల విచారణలో చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతనే మమ్మల్ని బెదిరించి ని చేయించాడు. 2023 ఉంచి నా ఫేస్ బుక్ ఐడీతోనే ఓస్ట్‌లు పెట్టేవారు. వైసీసీ సోషల్ మీడయాలో భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుమా రెడ్డిలు కీలకం అని రవీందర్ రెడ్డి పోలీసులకు తెలిపాడు. Also Read : AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఆ శాఖకు భారీగా నిధులు! Also Read : కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? #sajjala-bhargav-reddy #ap-ycp #social-media #kadapa police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి