ఇవాళ ఒక్కరోజే భారీగా రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మృతి చెందారంటే! ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు. By Seetha Ram 10 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడంలేదు. దీని కారణంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఇవాళ ఉదయం (నవంబర్ 10న) ఘోర ప్రమాదం జరిగింది. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గేటు సమీపంలో ఓ కారు అత్యంత వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కడ్తాల్ వైపుగా వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మహేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మరణించిన ఇద్దరు పహాడి షరీఫ్ వాస్తవ్యులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చరికి తరలించారు. కడప చెన్నై జాతీయ రహదారిపై Also Read: USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు కడప చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు స్కూటర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతులు సిద్ధవటం మండలం వడ్డీ వారి పల్లి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ కరీంనగర్ - జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఇవాళ తెల్లవారిజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉండగా.. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న సంకీర్త్ అనే యువకుడు, అతడి పక్కన ఉన్న యువతి మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న రాయమల్లు, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామలో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. #road accident Latest News in Telugu #road-accident #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి