Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !

ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, శ్రీకాకుళం20, తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.

New Update
Weather Alert: ఈ వేసవికి ఎండలు దంచికొడతాయి: ఐఎండీ హెచ్చరిక

Weather Alert

ఇంకా ఏప్రిల్‌రాను అన్న రాలేదు..భానుడు మాత్రం భగభగమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రతరమవుతున్నాయి. ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఇదే నిదర్శనమని అధికారులు అంటున్నారు.

Also Read:Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

శనివారంభానుడి భగభగలకు చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ అల్లాడిపోయారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.రాత్రి 7 గంటల వరకు వేడి తీవ్రత తగ్గలేదు. గతంలో మే నెలలో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని వాతావరణ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

Also Read: Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!

శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్సాఆర్‌ జిల్లా అట్లూరులో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌ లో ఇదే అత్యధికం.వైఎస్సాఆర్‌,నంద్యాల,అనకాపల్లి, ప్రకాశం,కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, పార్వతీపురం,మన్యం,శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాల్లోని 96  మండలాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటింది.

మరో 232 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 27 మండలాల్లో తీవ్ర వడగాలులు, 103 మండలాల్లో వడగాలులు వీచాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోతీవ్రవడగాలులు,మరో 126 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు.

విజయనగరం జిల్లాలో 23 మండలాలు, శ్రీకాకుళం20,తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11,కాకినాడ7, అల్లూరి సీతారామరాజు 7, ఏలూరు 7,అంబేద్కర్‌ కోనసీమ 7, ఎన్టీఆర్‌ 5,గుంటూరు 2,పశ్చిమ గోదావరి 2,పల్నాడు 2,విశాఖపట్నం 1 జిల్లాల్లోని మండలాల్లో అత్యధికంగా వడగాలులు వీచే అవకాశాలున్న మండలాలుగా అధికారులు గుర్తించారు. 

Also Read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?

Also Read: Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష

vijayanagaram | vijayanagaram-news | west-godavari | kurnool | latest-news | latest-telugu-news | latest telugu news updates 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు