/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న తెలంగాణ మంత్రి వర్గవిస్తరణకు సమయం రానే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలోకి మరో నలుగురిని తీసుకోనున్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. మంత్రివర్గవిస్తరణ గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్‌లో మరో నలుగురు కొత్త మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్ఠానం కొంతమంది పేర్లను సిద్ధం చేసి ఉంచింది. పార్టీలో వర్గ విభేదాలు రాకుండా ఉండేదుకు ఒకేసారి వారి పేర్లు ప్రకటించింది. ప్రమాణస్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమాచారం. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. మంత్రుల వారి శాఖలను మార్చే అవకాశం కూడా ఉండొచ్చు.
అదే విధంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఫైనల్ లిస్డ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్ పేర్లను ఫైనల్ చేసినట్లు చర్చ సాగుతోంది. మండలి నుంచి ఈ సారి ఎవరికీ అవకాశం లేదని సమాచారం.
Also read: Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ..ఆమెకు డౌటే?