Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
AP: సజ్జల భార్గవ్ హైకోర్టు ఆశ్రయించారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం, మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బోరుగడ్డ అనిల్ కేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. అరండల్ పేట సీఐ కుంకా శ్రీనివాసరావును వీఆర్‌కు పంపిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఐజీ ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై వేటు పడింది.
ఏపీలో మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచేందుకు ఈ ట్రైన్ మార్గం నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా ఈ ట్రైన్ మార్గం రానుంది.
గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరుగడ్డ అనిల్ కు మరోసారి పోలీసులు రాచమర్యాదలు చేశారు. దగ్గరుండి కుర్చీలు వేసి అన్నం వడ్డించారు. పడుకోవడాని బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు.
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. మొత్తం 59 మందితో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా కార్పొరేషన్ పదవుల్లో టీడీపీ నుంచి 46 మంది, జనసేన నుంచి 10 మంది, బీజేపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి.