బీచ్ ప్రియులకు బిగ్‌షాక్..ఈ 5బీచ్‌లకు వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే!

ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.

New Update
charge entry fees at beaches

ఈ సీజన్‌లో చాలా మంది బీచ్‌లకు వెళ్తుంటారు. ఫ్రెండ్స్‌తో జాలీగా ట్రిప్‌లు, పిక్‌నిక్ అంటూ పార్టీలు చేసుకునేందుకు బీచ్‌లనే సెలక్ట్ చేసుకుంటుంటారు. చల్లని గాలి, సముద్ర అలల మధ్య ఎంజాయ్ చేస్తుంటారు. అందులోనూ ఇప్పుడు కార్తీక మాసం కావడంతో చాలా మంది పర్యాటకులు బీచ్‌ల బాట పడతారు. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. త్వరలో బీచ్‌లలో ఎంట్రీ ఫీజు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. 

ఇది కూడా చదవండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!

బీచ్‌లలో ఎంట్రీ ఫీజు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది 2025 జనవరి నుంచి ముందుగా కొన్ని బీచ్‌లలో ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!

ఏ ఏ బీచ్‌లలో అంటే?

అందులో సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్‌లలో మొదటిగా ఎంట్రీ ఫీసు వసూళు చేయబోతున్నారు. దీనిపై తాజాగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. రాష్రవ్యాప్తంగా ఉన్న బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేసేందుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తుందని అన్నారు. అయితే ఎంత అనేది క్లారిటీ లేదని తెలిపారు. అది రూ.20 లేక రూ.25 అనేది నిర్ణయించలేదన్నారు. అయితే ఇప్పటికే బీచ్‌లలో బోటింగ్, పార్కింగ్, గేమ్స్ వంటి వాటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఎంట్రీ ఫీజు పెడితే పర్యాటకుల సంఖ్య తగ్గుతుందని కూడా కొందరు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ వాసులు బి అలెర్ట్‌...ఈ ఏరియాల్లో వాటర్‌ బంద్‌!

జనవరి 1 నుంచి మొదలు

 ఇకపోతే బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్‌లో ఎంట్రీ ఫీజుపై ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే కార్తీక మాసం కావడంతో సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకుల నుంచి బీచ్ డెవలప్‌మెంట్ కోసం ఫీజు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఫీజు కింద రూ.20 వసూలు చేస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి ఫీజు విధానాన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ!

#beach #rushi-konda #kakinada #andhra-pradesh
Advertisment
Advertisment
తాజా కథనాలు