Srireddy: శ్రీరెడ్డి అరెస్ట్.. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు! శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమె పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ తెలుగు మహిళా కన్వీనర్ ఆసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీ రెడ్డి అరెస్ట్ కాబోతుందనే ప్రచారం జోరందుకుంది. By srinivas 14 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీ రెడ్డి పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మచిలీపట్నం పార్లమెంటరీ సోషల్ మీడియా తెలుగు మహిళా కన్వీనర్ ఆసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా యువతను తప్పు దోవ పట్టించిందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినంగా శిక్షించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వంద శాతం శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. Also Read : డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఈ తప్పులు చేస్తే బంధం ముక్కలే..! భవిష్యత్తులో మళ్లీ చేయకుండా చర్యలు.. ఈ మేరకు నిర్మల ఫిర్యాదుపై మీడియాతో మాట్లాడిన.. గుడివాడ వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలపై శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్మలా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇక అసిలేటి నిర్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి దుర్భాషలాడుతూ అసభ్యకరమైన పోస్టులు పెట్టింది. ఆమె పెట్టిన పోస్టులు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది చూశారు. శ్రీ రెడ్డి మాట్లాడిన మాటలను ఆదర్శంగా తీసుకొని వైసీపీ నాయకులు టీడీపీ వారిపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దుర్భాషలాడుతున్నారు. నేను పెట్టిన కేసు వారికి కనువిప్పు కలగాలి. భవిష్యత్తులో ఎవరైనా సరే వ్యక్తుల మనోభావాలను కించిపరిచేలా సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టకూడదని నా ఉద్దేశం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూాడా చదవండి: తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట! ఇదిలా ఉంటే.. నారా లోకేష్ ను ఉద్దేశించి లేఖ రాసిన శ్రీరెడ్డి.. ‘ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి!. నేను పుట్టింది గోదావరి అయినా.. పెరిగింది మొత్తం విజయవాడలోనే. నాకు మీ సామాజికవర్గానికి చెందినవారే 95% స్నేహితులు ఉన్నారు. గత ఎన్నికల్లో నా తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేశారు’ అంటూ తనను వదిలేయాలని రిక్వెస్ట్ చేసింది. ఇది కూాడా చదవండి: Boeing: బోయింగ్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపు...17వేల మంది ఎఫెక్ట్ వైసీపీ అధినేత జగన్ కు మరో లేఖ రాసింది. భారతికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకు మిమ్మల్ని నేరుగా కలిసే అదృష్టం కానీ, కలిసి ఫొటో దిగే అవకాశం లేదు. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. వైసీపీకి తన పేరుతో చెడ్డపేరు తీసుకొచ్చానంటూ శ్రీరెడ్డి అందులో పేర్కొంది. తాను గతలో చేసిన పనికి.. నేడు మీడియాలో చాలా మంది పార్టీని దుమ్మెత్తి పోయడం తనను మానసికంగా కృంగదీసిందని.. పార్టీని పలువురి మాటల దాడిలో సేవ్ చేస్తున్నానని అనుకున్నానే తప్ప డ్యామేజ్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయానని ఆమె చెప్పింది. తాను వైసీపీ సభ్యురాలిని కానప్పటికీ... సాక్షిలో పనిచేసినప్పటి నుంచీ జగన్, భారతిలపై గౌరవమర్యాదలు ఏర్పడ్డాయని.. ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు. తన పాపం మీకు అంటుకోకూడదని తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాయో అర్ధం చేసుకోగలలని చెప్పింది. ఈ సందర్భంగా తాను వైసీపీకి, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని.. తనను క్షమించాలని కోరుతూ... ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది. Also Read: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం.. #jagan #sri-reddy #ap-cm-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి