Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

New Update
Rains

AP Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. దీని ప్రభావంతో గురువారం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: Movies: సూర్య కెరీర్‌‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే..

అలాగే నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు.

Also Read:  MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు,  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. వర్షాల అలర్ట్‌తో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ

మరో రెండు రోజులపాటు..

రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం మారిపోయింది.. వర్షాలు కురిశాయి. తూర్పుప్రాంతంలో ఒకమోస్తరు వాన పడింది. మరో రెండు రోజులపాటు జిల్లాలో వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు రైతుల్ని భయపెడుతున్నాయి. రోడ్ల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు.. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొంత నష్టమైనా తప్పని పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు