/rtv/media/media_files/2025/05/10/P194bZifBVvGP0UqPxBk.jpg)
Turkey's d
Turkey Supports Pakistan: సాయం చేసిన మేలు మరిచి టర్కీ భారత్‌కి(India) వెన్ను పోటు పొడిచింది. భారత్, పాక్‌కి జరిగిన యుద్ధంలో టర్కీ ఆయుధాలు పంపిన విషయం తెలిసిందే. టర్కీ పాక్‌తో కలిసి భారత్‌పైకి డ్రోన్లు పంపింది. అయితే భారత్‌పై ప్రయోగించిన ఆ డ్రోన్లను సైన్యం నాశనం చేసింది. గతంలో టర్కీలో భారీ భూకంపం సంభవిస్తే.. భారత్ సాయపడింది. టర్కీకి భారత్ 8 లక్షల 45 వేల డాలర్ల విలువైన సామాగ్రిని అందజేసింది. ఈ సాయాన్ని మరిచిపోయి టర్కీ పాక్‌కు డ్రోన్లను( Drones ) అందించింది.
సైన్యాన్ని కూడా టర్కీ పంపినట్లు..
ఇదే కాకుండా ఇప్పుడు టర్కీ మరో కుట్ర కూడా బయటపడింది. భారత్‌పై యుద్ధానికి టర్కీ పాక్‌కి కేవలం డ్రోన్లు, ఆయుధాలను మాత్రమే సప్లై చేయకుండా వారి సైన్యాన్ని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్ సిందూర్‌లో(Operation Sindoor) ఇద్దరు టర్కిష్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన సాయాన్ని మరిచి టర్కీ వెన్నుపోటు పొడిచింది.
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
ఇదిలా ఉండగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిన వెంటనే.. దాయాది దేశం కూడా తిరగబడింది. దాదాపుగా 300 నుంచి 400 డ్రోన్లను భారత్‌పై ప్రయోగించింది. వీటిని భారత సైన్యం కుప్పకూల్చింది. అయితే ఈ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా.. అవన్నీ కూడా టర్కీకి చెందినట్లు గుర్తించారు. అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధ్రువీకరించారు. అయితే పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించి పంపినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
ప్రపంచమంతా భారత్‌కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో టర్కీ మాత్రం ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. వాటినే పాక్ భారత్‌పై ప్రయోగించింది. అయితే పహల్గాం దాడి తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్ధతుగా నిలిస్తే ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.