Explainer: భారీగా విమానాలు నడుపుతున్నా.. భారత విమానయాన సంస్థలు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నాయి?

ఇండియాలో తిరిగినన్ని విమానాలు చాలా దేశాల్లో తిరగవు. ఇక్కడ గగనతలం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయినా కూడా భారత్ విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి?

New Update
flights

భారత్ లో విమానాశ్రయాలు విశ్రయిస్తున్నాయి. పదుల్లో విమాన సర్వీసులున్నాయి. ఆకాశం ఎప్పుడూ లేనంత రద్దీగా ఉంటోంది. ప్రజల్లో కూడా ఎవేర్నెస్ పెరిగింది. విమానాల్లో ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. విమానయాన సంస్థలకు బోలెడంత డబ్బులు కూడా వస్తున్నాయి. అయినా కూడా అవి ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ వలన కలిగిన ఇబ్బంది అయితే చెప్పనే అక్కర్లేదు. లక్షల్లో ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. ఒక్క ఇండిగోనే అలా అయిందా అంటే లేదనే చెప్పాలి. గత కొన్నేళ్ళుగా చాలా విమానయాన సంస్థలు ప్రాబ్లెమ్స్ ను ఎదుర్కుంటున్నాయి. కొన్ని అయితే సర్వీసులను నడపలేక మూతబడిపోయాయి కూడా.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ డెక్కన్, పారామౌంట్ ఎయిర్‌వేస్ , గో ఫస్ట్‌లు ఒకప్పుడు భారతీయ విమానయానంలో ఎక్కువగా మాట్లాడుకునే పేర్లు. కానీ ఇప్పుడు ఫెల్యూర్ విమాన సర్వీసులుగా మిగిలిపోయాయి. వీటిల్లో కొన్ని లగ్జరీని హామీ ఇచ్చాయి..మరి కొన్న చౌక ఛార్జీలను హామీ ఇచ్చాయి.. ఇంకా కొన్ని చిన్న నగరాలను అనుసంధానిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో కొంతకాలం వారు చాలా కొద్ది కాలంలోనే వేగంగా విస్తరించారు, పూర్తి విమానాలను నడిపారు. కానీ అంతే వేగంగా ఆ సంస్థలు మూత కూడా పడిపోయాయి. తరువాత ఒక్కొక్కటిగా, వారి డబ్బులు అయిపోయాయి. నియంత్రణ ఇబ్బందుల్లో సతమతమయిపోయాయి. నిర్వహణ చేయలేక చేతులెత్తేశాయి. అయితే ఇవన్నీ అకస్మాత్తుగా జరిగినవి కావు.

అధికార స్వామ్యం..

ఎందుకిలా అయింది అని విశ్లేషించుకుంటే..భారత్ లో విమానయాన సర్వీసులను నడపడం అంత ఈజీ కాదు. ఇక్కడ వాటిని నెలకొల్పడం చాలా తేలిక. కానీ దాన్ని మెయింటెయిన్ చేయాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలి. దీని గురించి బాగా తెలియాలంటే సూర్య నటించిన ఆకాశం హద్దుగా సినిమా చూస్తే సరిపోతుంది. భారత్ లో పాతుకుపోయిన అధికార స్వామ్యం దేన్నీ అంత తొందరగా ఎదగనివ్వదు. ఒకవేళ దాన్ని ఎదురించి కొత్తవి వచ్చినా చాలా తక్కువ కాలంలోనే ఫెల్యూర్లుగా నిలిచిపోతాయి. పైన చెప్పిన విమాన సంస్థలు అన్ని దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి.

మార్కెట్ నిర్మాణం..

ప్రపంచంలో నేడు భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటి అయినప్పటికీ, ఇక్కడ విమానయాన సంస్థను నడపడం ఇప్పటికీ అత్యంత కఠినమైన వ్యాపారాలలో ఒకటి. భారత్ లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి దేశీయ విమానయాన మార్కెట్లలో ఒకటిగా ఉంది. ప్రయాణీకుల రద్దీ ఏటా 200 మిలియన్లు దాటింది. నవీ ముంబై, జెవార్, గోవా ..అనేక ప్రాంతీయ కేంద్రాలలో కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయి. విమానయాన సంస్థలు 1,900 కంటే ఎక్కువ విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. భవిష్యత్తు గురించి ఇది నమ్మకాన్ని పెంచుతోంది. అయినా కూడా విమానయాన సంస్థల్లో అస్థిరత మాత్రం తగ్గలేదు. గత మూడు దశాబ్దాలుగా, భారతదేశంలో డజన్ల కొద్దీ విమానయాన సంస్థలు మూసివేయబడ్డాయి. దీనిని కేవలం నిర్వహణ లోపమనే చెప్పలేమని..మార్కెట్ నిర్మాణం కూడా కరణమని అంటున్నారు.

టికెట్ రేటును తగ్గించడం కదరదు..

భారతదేశం ధరలకు చాలా సున్నితమైన మార్కెట్, అధిక డిమాండ్ అంటే అధిక లాభాలు అని అర్థం కాదు. ఫలితంగా, విమానయాన సంస్థలు పూర్తి సామర్థ్యంతో ఎగురుతాయి కానీ మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని BTG అద్వయ భాగస్వామి మాన్సి సింగ్ చెబుతున్నారు. మరోవైపు గత 15 నుండి 20 సంవత్సరాలలో విమానయానం బాగా అభివృద్ధి చెందినప్పటికీ, భారతదేశంలో చాలా మంది ఇప్పటికీ రైళ్లలో ప్రయాణిస్తారు, ముఖ్యంగా చిన్న మార్గాల్లో. పొడవైన మార్గాల్లో కూడా రైళ్లు నిండి ఉంటాయి. విమానయాన సంస్థలు బలమైన విలువను అందించకపోతే, చాలా మంది ప్రయాణీకులు ఇప్పటికీ రైలును ఎంచుకుంటారు అని అంటున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలు నిరంతరం సమతుల్యత పాటించాల్సి వస్తుంది. రైళ్లకు దూరంగా ప్రయాణీకులను ఆకర్షించేంత తక్కువగా ఛార్జీలను ఉంచాలి. కానీ విమానాలను నడపడం ఖర్చుతో కూడుకున్న పని. రైళ్ళ ఛార్జీలను ఎప్పటికీ ఇవ్వడం కుదరదు అనిచెప్పుకొచ్చారు.

విమానం మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ..

దీంతో పాటూ ప్రపంచంలోనే ATF పై అత్యధిక పన్నులు విధించే దేశాల్లో భారతదేశం ఒకటి. అలాగే విమానాల్లో వాడే టర్బైన్ ఇంధనం కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ATF అనేది విమానయాన సంస్థలు అంతర్గతంగా నిర్వహించగల విషయం కాదు. వారు దానిని టిక్కెట్ ధరల ద్వారా ప్రయాణీకులకు బదిలీ చేయవలసి వస్తుంది, కానీ పోటీ మార్కెట్‌లో అది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అలాగే పైలట్లు, ఇంజనీర్ల కొరత, విమాన తయారీదారుల నుండి సరఫరా గొలుసు జాప్యాలు ఇవన్నీ కూడా విమానయాన సంస్థలకు భారం అవుతున్నాయి. ఇన్ని హర్డిల్స్ ను దాటుకుని వ్యాపారం చేయడం చాలా కష్టం అవుతోంది. అందుకే చాలా విమానయాన సంస్థలు మూతబడ్డాయి. ఉన్నవి కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు