AI Tools: కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశం

కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. వీటిని వాడటం చాలా ప్రమాదకరమని.. దేశానికి సంబంధించిన రహస్య సమాచారం బయటకు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

New Update
Government warns employees Avoid ChatGPT and AI tools

Government warns employees Avoid ChatGPT and AI tools

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. జెమినై, చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌ను దాదాపు అన్ని రంగాల్లో వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. వీటిని వాడటం చాలా ప్రమాదకరమని.. దేశానికి సంబంధించిన రహస్య సమాచారం బయటకు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని చాట్‌ జీపీడీ లాంటి ఏఐ టూల్స్‌ ద్వారా షేర్ చేస్తున్నట్లు పేర్కొంది.    

Also Read: భారీగా విమానాలు నడుపుతున్నా.. భారత విమానయాన సంస్థలు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నాయి?

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇతర కీలకమైన సమాచారం ఇలాంటి ఏఐ టూల్స్ ద్వారా విదేశాలకు వెళ్తున్నట్లు కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద రాజ్యసభలో వెల్లడించారు.  వీటిని నియంత్రించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇకనుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్‌జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ను వాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 

Also Read: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్లు..నానాపాట్లు పడుతున్న హెచ్1 వీసాదారులు..

Advertisment
తాజా కథనాలు