/rtv/media/media_files/2025/04/20/niFWMIRALq2zmSE5wVAY.jpg)
Constable murdered in Nandyal
Constable murdered in Nandyal : నంద్యాల జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరుకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ముల్లా ఫరూక్ (36) ప్రస్తుతం మంగళగిరిలోని అక్టోపస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఫరూక్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.గతంలో ఫరూక్ కర్నూలులో విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరుకు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే వివాహమైంది. అయితే ఆమె భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. అయినప్పటికీ ఫరూక్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది.
Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు
అయితే ఈ క్రమంలోనే ఫరూక్ బదిలీలో భాగంగా మంగళగిరికి వెళ్లాడు. అయితే ఆమె మాత్రం నంద్యాలలోనే ఉండేది. ఆమెకు ఆర్థిక, ఇతర ఏమైనా అవసరాలు ఉంటే తీర్చే పనిని స్నేహితులకు అప్పగించాడు.ఆమెకు అవసరాలు తీర్చే క్రమంలో ఫరూక్ స్నేహితుల్లో ఒకరైన షబ్బీర్ ఆమెకు దగ్గరయ్యాడు. సరుకులు తెచ్చి ఇచ్చే సమయంలో ఆ మహిళ కుమార్తె (18) కన్నేశాడు షబ్బీర్. మహిళా కుమార్తెతో ప్రేమలో పడ్డాడు షబ్బీర్. ఇద్దరికి పెళ్లి చేయమని మహిళను అడగ్గా నిరాకరించిందని సమాచారం. కానీ, వాళ్ల ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చింది.. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఫరూక్ తన ప్రియురాలి కుమార్తెను అనుభవించాలనుకున్నాడు. యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతని వేధింపులు భరించలేక తన ప్రియుడు షబ్బీర్ కు ఆ విషయాన్ని చెప్పింది సదరు యువతి.
Also Read: BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
అయితే, తన ప్రేమకు అడ్డుగా ఉండడమే కాక ప్రియురాలు వేధించడంతో కానిస్టేబుల్ ఫరూక్ ను లేపేయాలను కున్నాడు షబ్బీర్. అందుకు పక్కా ప్లాన్ వేశాడు షబ్బీర్. మంగళగిరి నుండి కానిస్టేబుల్ నేరుగా నాలుగైదు రోజుల క్రితం నందమూరి నగర్ కి వచ్చాడు. తర్వాత ఫరూక్ కు షబ్బీర్ మాయమాటలు చెప్పి అతని కారులో ఎక్కించుకొని చాగలమర్రి ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. మిత్రుడు రిజ్వాన్ తో కలిసి కానిస్టేబుల్ కు మద్యం తాగించి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే విసిరేశారు. అయితే హత్య కేసు అవుతుందని నల్లమల అడవిలో మృతదేహాన్ని వదిలేస్తే కుళ్లిపోయి ఎవరికి తెలియకుండా పోతుందని భావించి, ప్లాస్టిక్ కవర్ లో కట్టి కారులో తీసుకెళ్లి పచ్చర్ల సమీపంలోని దొరబావి వంతెన వద్ద లోయలో మృతదేహాన్ని విసిరేశారు.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
మంగళగిరి హెడ్ క్వార్టర్ నుండి వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్ తిరిగి విధుల్లోకి చేరలేదు. దీంతో అతనిపై ఆరా తీశారు. ఆయన ఇంటికి కూడా చేరలేదని తెలియడంతో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్, ఫోన్ ట్రాకింగ్ ద్వారా నందమూరి నగర్ ప్రాంతానికి వచ్చినట్లు కనిపెట్టారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని వివరాలను అందజేసింది. వీటి ఆధారంగా హత్య జరిగిందని నిర్ధారించుకొని మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారం ద్వారా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళతోపాటు, షబ్బీర్, రిజ్వాన్ పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..
Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!
Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!